తెలంగాణ

telangana

వ్యాపార సముదాయాలను నిండాముంచిన భారీ వర్షం

By

Published : Oct 15, 2020, 4:48 PM IST

వరుణుడి విధ్వంసానికి భాగ్యనగర వాసుల కష్టాలు ఇప్పుడే తప్పేలా లేవు. నగరాన్ని ముంచేసిన భారీ వర్షం బేగంబజార్ వ్యాపార దుకాణాలను మురికి కూపంలా మార్చింది. దీంతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్న అధికారులు స్పందించడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Heavy drinage watre in begam bazar
వ్యాపార సముదాయాలను ముంచేత్తిన భారీ వర్షం

హైదరాబాద్​లో కుండపోత వర్షం బేగంబజార్​లోని వ్యాపార సముదాయాలను ముంచెత్తింది. దుకాణాల్లోకి భారీ వరద నీరు చేరడంతో వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయారు. నగరంలో అత్యంత రద్దీ వ్యాపార కేంద్రంగా పేరొందిన బేగంబజార్ మురికి కూపాన్ని తలపించింది.

పధన్వాడీఖాన్​ మార్కెట్​లో సెల్లార్​లోకి వరద నీరు రావడంతో వస్తువులన్నీ నీట మునిగాయి. రహదారులపై మురికి నీరు చేరడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్ని హామీలు ఇచ్చినా డ్రైనేజీ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చూపడం లేదంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని స్థానిక వ్యాపారస్తులు కోరుతున్నారు.

వ్యాపార సముదాయాలను ముంచేత్తిన భారీ వర్షం

ఇదీ చదవండి:భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి​ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details