తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌కు సమీపంలో తీవ్ర వాయుగుండం

కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణపై వాయుగుండం కొనసాగుతోంది. హైదరాబాద్​కు పశ్చిమవాయువ్య దిశగా 25కి.మీ. వేగంతో కదులుతోంది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్​ఎంసీ అధికారులు హెచ్చరించారు.

Heavy cyclone near to Hyderabad
హైదరాబాద్‌కు సమీపంలో తీవ్ర వాయుగుండం

By

Published : Oct 14, 2020, 2:49 PM IST

హైదరాబాద్‌కు పశ్చిమంగా 25 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. రాగల 12 గంటల్లో వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీన పడనుందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మరో వైపు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగర వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కనీసం మూడు రోజులు నగరంలోని ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు.

ఇవీచూడండి:భారీ వర్షానికి... భాగ్యనగరం అతలాకుతలం

ABOUT THE AUTHOR

...view details