రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లు, అనధికార ప్లాట్ల క్రమబద్దీకరణ ఎల్ఆర్ఎస్కు భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 72 వేల 947 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మున్సిపాలిటీల నుంచి లక్షా 51వేల 940 దరఖాస్తులు రాగా.. గ్రామ పంచాయతీల నుంచి లక్షా 37వేల 240 దరఖాస్తులు వచ్చాయి.
ఎల్ఆర్ఎస్కు విశేష స్పందన.. భారీగా దరఖాస్తులు - ఎల్ఆర్ఎస్కు విశేష స్పందన
అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణకు కేసీఆర్ ప్రభుత్వం మరోసారి అవకాశం ఇవ్వడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా భారీగా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 72 వేల 947 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు నమోదయ్యాయి
ఎల్ఆర్ఎస్కు విశేష స్పందన.. భారీగా దరఖాస్తులు
మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 83, 767 దరఖాస్తులు వచ్చాయి. ఎల్ఆర్ఎస్ నుంచి రుసుము కింద సర్కారు ఖజానాకు 37. 87 కోట్ల రూపాయలు చేరింది.
ఇవీ చూడండి:గవర్నర్కు టీఎస్పీఎస్సీ వార్షిక నివేదిక