రాష్ట్రంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం నుంచే భగ్గుమంటున్నాడు. ఫలితంగా బయట అడుగు వేస్తేనే.. నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టుగా అనిపిస్తోంది. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలన్నా.. వడగాల్పుల భయంతో ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా కుబీర్, ఆదిలాబాద్ జిల్లా బోరాజ్లలో అత్యధికంగా 42.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ములుగు జిల్లాలోని మేడారంలో 42.2 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్, ఆదిలాబాద్ అర్బన్, నిర్మల్ జిల్లాలోని తానూర్లలో 42.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.