రాష్ట్రంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం నుంచే భగ్గుమంటున్నాడు. ఫలితంగా బయట అడుగు వేస్తేనే.. నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టుగా అనిపిస్తోంది. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలన్నా.. వడగాల్పుల భయంతో ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. తాజాగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో అత్యధికంగా 44.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ములుగు జిల్లాలోని తాడ్వాయి, నిర్మల్ జిల్లా ఖానాపూర్, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లెగోరిలో 44.8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బోరాజ్లో 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
భానుడు బుధవారం భగభగా మండాడు. ఉదయం 9.27 నిమిషాలకు ఒక్కసారిగా భారీ స్థాయిలో సౌరజ్వాలలతో విరుచుకుపడ్డాడు. సమాచార ఉపగ్రహాలు, జీపీఎస్ వ్యవస్థల్ని దెబ్బతీసే స్థాయిలో ఈ సౌరజ్వాలలు ఉన్నాయని కోల్కతా కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్సెస్ ఇండియా-సెస్సీ వెల్లడించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.