హైదరాబాద్‌లోని కిమ్స్ వైద్యులు గుండె మార్పిడి ద్వారా ఓ వ్యక్తి ప్రాణాలను నిలిపారు. లక్డీకపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో జీవన్మృతుడు (బ్రెయిన్ డెడ్) అయిన ఓ వ్యక్తి గుండె మరో వ్యక్తికి అమర్చారు. ఆస్పత్రిలోనే అతను బ్రెయిన్ డెడ్ కావటంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జీవన్‌దాన్ ద్వారా ఇంకొకరికి ప్రాణం పోయవచ్చని వైద్యులు చెప్పటంతో వారు వెంటనే అంగీకరించారు.
ఐదు నిమిషాాల్లో 5.7 కిలోమీటర్లు...నిలిచిన నిండు ప్రాణం - హైదరాబాద్ నగర వార్తలు
ఒకరికి గుండె, ఇంకొకరికి ఊపిరితిత్తులు, మరొకరికి కళ్లు ఇలా అవయవాల కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. అవి అందక నిత్యం మరణిస్తున్న వారూ లక్షల్లోనే ఉన్నారు. హైదరాబాద్‌లో జీవన్మృతుడు(బ్రెయిన్ డెడ్) అయిన ఓ వ్యక్తి గుండె మరొకరి ప్రాణం కాపాడింది.
![ఐదు నిమిషాాల్లో 5.7 కిలోమీటర్లు...నిలిచిన నిండు ప్రాణం Heart transplantation success in kims hospital hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9302825-90-9302825-1603578971816.jpg)
ఐదు నిమిషాాల్లో 5.7 కిలోమీటర్లు...నిలిచిన నిండు ప్రాణం
కిమ్స్ ఆస్పత్రిలో మరో వ్యక్తికి గుండె అవసరముందని తెలిసింది. వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది ట్రాఫిక్ పోలీసులకు, ఆస్పత్రికి సమాచారం అందించారు. వెంటనే గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి 5.7 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఐదు నిమిషాల్లో గుండెను కిమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి గుండెను విజయవంతంగా అమర్చారు.