జలశక్తి శాఖను సంప్రదించండి.. కాళేశ్వరంపై పిటిషనర్‌కు ఎన్జీటీ సూచన - Kaleshwaram project latest updats
14:07 April 12
జలశక్తి శాఖను సంప్రదించండి.. కాళేశ్వరంపై పిటిషనర్‌కు ఎన్జీటీ సూచన
కాళేశ్వరం విస్తరణ పనులపై (జాతీయ హరిత ట్రైబ్యునల్) ఎన్జీటీలో విచారణ జరిగింది. ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ పనులు చేస్తున్నారని తుమ్మనపల్లి శ్రీనివాస్, మరో ఇద్దరు పిటిషన్ దాఖలు చేశారు. ఎన్జీటీ సూచన మేరకు సుప్రీంను ఆశ్రయించామన్న పిటిషనర్లు... మళ్లీ ఎన్జీటీకే వెళ్లాలని అత్యున్నత న్యాయస్థానం సూచించిందని పేర్కొన్నారు.
పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు చేస్తున్నారన్న పిటిషనర్లు స్పష్టం చేశారు. తాము ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని జాతీయ హరిత ట్రైబ్యునల్ తెలిపింది. తమ ఆదేశాల అమలుపై కేంద్రానికి నివేదించాలని ఎన్జీటీ సూచించింది. కేంద్ర జలశక్తిశాఖను సంప్రదించేందుకు పిటిషనర్లకు ఎన్జీటీ అనుమతినిచ్చింది.