Vaishali kidnapping case update: ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని మన్నెగూడకు చెందిన వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణ ముగిసింది. ఈ కేసుకు సంబంధించి దాడిలో పాల్గొన్న 32 మంది హస్తినాపురం కేశవపురి కాలనీలోని మిస్టర్ టీ ప్రధాన కార్యాలయంలో శనివారం సమావేశమైనట్లు సమాచారం అందుకుని పోలీసులు వారిని అరెస్టు చేశారు.
నిందితుల కస్టడీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. రేపు కోర్టుకు నవీన్‌రెడ్డి - Vaishali Kidnapping Case
custody petition of accused in Vaishali kidnapping case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మన్నెగూడ వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణ ముగిసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డితో పాటు మరో 32 మందిని పోలీసులు అరెస్టు చేసి.. కస్టడీకి కోరగా విచారణ చేపట్టిన ఇబ్రహీంపట్నం కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.
![నిందితుల కస్టడీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. రేపు కోర్టుకు నవీన్‌రెడ్డి Naveen Reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17205851-776-17205851-1671021273887.jpg)
Naveen Reddy
వీరిలో నాగారం భానుప్రకాశ్ (20), రాథోడ్ సాయినాథ్ (22), గానోజి ప్రసాద్ (25), కోతి హరి (30), బోని విశ్వేశ్వర్‌రావు (26)లను కస్టడీకి ఇవ్వాలని ఆదిభట్ల పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం.. తీర్పును రేపటికి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి మంగళవారం గోవాలో పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. నవీన్ రెడ్డిని హైదరాబాద్ తీసుకొచ్చిన పోలీసులు.. రేపు కోర్టులో హాజరుపర్చనున్నారు.
ఇవీ చదవండి: