తెలంగాణ

telangana

ETV Bharat / state

20 రోజుల్లో ఎలా పరిష్కరిస్తారో చూస్తాం: హైకోర్టు - telangana High Court latest news

నూతన రెవెన్యూ ట్రైబ్యునళ్లపై హైకోర్టు విచారణ జరిగింది. సహజ న్యాయసూత్రాలు అమలు చేయాలని పేర్కొంది. 20 రోజుల్లో ఎలా పరిష్కరిస్తారో తెలుసుకోవాలని ఉందని హైకోర్టు వెల్లడించింది.

20 రోజుల్లో ఎలా పరిష్కరిస్తారో చూస్తాం: హైకోర్టు
20 రోజుల్లో ఎలా పరిష్కరిస్తారో చూస్తాం: హైకోర్టు

By

Published : Feb 25, 2021, 5:44 PM IST

నూతన రెవెన్యూ ట్రైబ్యునళ్లపై విచారణ జరిపిన హైకోర్టు.. 20 రోజుల్లో వివాదం ఎలా పరిష్కరిస్తారో తెలుసుకోవాలని ఉందని వ్యాఖ్యానించింది. ఇరుపక్షాల వాదనలు వినకుండా వివాద పరిష్కారం సరికాదని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. సహజ న్యాయసూత్రాలను అమలు చేయాలి కదా అని పేర్కొంది.

ప్రభుత్వ వివరణ తెలుసుకుని చెబుతామని అడ్వకేట్ జనరల్ తెలపగా.. రెనెన్యూ ట్రైబ్యునళ్లపై విచారణను హైకోర్టు మార్చి 2కు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details