తెలంగాణ

telangana

ETV Bharat / state

అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్​పై విచారణ వాయిదా

ఏపీలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బెయిల్​ పిటిషన్​పై విచారణను శ్రీకాకుళం జిల్లా సోంపేట కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్​పై విచారణ వాయిదా
అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్​పై విచారణ వాయిదా

By

Published : Feb 4, 2021, 12:31 PM IST

తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్​పై శ్రీకాకుళం జిల్లా సోంపేట న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. అయితే.. కేసు డైరీ రాని కారణంగా.. విచారణను న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు.. కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ కూడా సోమవారానికి వాయిదా పడింది.

పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి.. నామినేషన్ల విషయంలో వైకాపా, తెదేపా నేతల మధ్య తలెత్తిన వివాదం కేసులో... అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్​లో ఉన్నారు.

ఇదీ చదవండి:'పేట్లబురుజు​'.. దేశంలోనే ఉత్తమ పోలీస్ ట్రైనింగ్ సెంటర్​

ABOUT THE AUTHOR

...view details