తెలంగాణ

telangana

ETV Bharat / state

సుమారు 800 మంది నిరుపేదలకు ఆరోగ్యకరమైన భోజనం - నిరుపేదలకు ఆరోగ్యకరమైన భోజనం తాజా వార్తలు

ఆకలితో ఉన్న నిరుపేదలకు అన్న దానం చేస్తూ పలువురు తమ మానవతాన్ని చాటుకుంటున్నారు. హైదరాబాద్ రామంతాపూర్​కి చెందిన కార్తీక్ సూర్య.. తన స్నేహితులతో ప్రతి రోజు దాదాపు 600 నుంచి 800 మందికి అన్నదానము చేస్తున్నాడు. ఆరోగ్యంగా ఉండేందుకు కోడి గుడ్డు, బట్టర్​ మిల్క్​తోపాటు ఆదివారం నాన్​ వెజ్​ కూడా అందిస్తున్నట్లు సూర్య తెలిపాడు.

సుమారు 800 మంది నిరుపేదలకు ఆరోగ్యకరమైన భోజనం
సుమారు 800 మంది నిరుపేదలకు ఆరోగ్యకరమైన భోజనం

By

Published : Apr 25, 2020, 1:36 PM IST

లాక్​డౌన్​ కారణంగా పని లేక ఆకలితో అలమటిస్తున్న పలువురు పేదలకు హైదరాబాద్​లోని వివిధ ప్రాంతాల్లో అన్నదానం చేస్తున్నాడు రామంతాపూర్​కు చెందిన కార్తీక్​ సూర్య, అతని స్నేహితులు. ఆటోపై ఆహారాన్ని తీసుకెళుతూ సుమారు 600 నుంచి 800 మందికి అన్నదానం చేశారు.

లాక్​డౌన్​ మొదటి రోజు నుంచి ఇప్పటివరకు నిరంతరం కొనసాగిస్తున్నట్లు కార్తీక్ సూర్య తెలిపాడు. ప్రతిరోజు అన్నం, పప్పు, కోడిగుడ్లు, బట్టర్ మిల్క్​తో పాటు ఆదివారం నాన్ వెజ్ అందిస్తున్నట్లు వివరించాడు.

ఇదీ చూడండి:నీళ్లు ఎక్కువ తాగితే బరువు తగ్గుతారా?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details