తెలంగాణ

telangana

ETV Bharat / state

సెప్టెంబర్​ 1నుంచి  గ్రేటర్ పరిధిలో ఉచిత వైద్య శిబిరాలు

సీజనల్​ వ్యాధుల నివారణపై హైదరాబాద్​, రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాల వైద్యాధికారులతో జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​ సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్​ 1 నుంచి 15వ తేదీ వరకు 695 హెల్త్​ క్యాంపులు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో 695 హెల్త్​ క్యాంపులు

By

Published : Aug 23, 2019, 10:13 PM IST

నగరంలోని ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా 21 జ్వర నిర్ధరణ కౌంటర్లను అదనంగా తెరవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల నివారణపై హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వైద్యాధికారులు, జీహెచ్ఎంసీ మెడికల్, ఎంటమాలజి అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 695 హెల్త్ క్యాంపులను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ జిల్లాలో 250, రంగారెడ్డి జిల్లాలో 165, మేడ్చల్ జిల్లాలో 165 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రతి జోన్​లో 50 ఉచిత వైద్య శిబిరాలు

నగరంలోని ప్రధాన ప్రైవేట్ ఆసుపత్రుల సాయంతో ప్రతి జోన్​లో కనీసం 50 ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. నగరంలో జ్వరాలతో వచ్చే రోగులకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఫీవర్ ఆసుపత్రిలో 10, గాంధీలో 06, ఉస్మానియాలో 05 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కమిషనర్ వెల్లడించారు. ఈ ప్రత్యేక కౌంటర్లలో జనరల్ ఫిజిషియన్ అందుబాటులో ఉంటారని, వీటి సమయాన్ని సాయంత్రం నాలుగు గంటల వరకు పెంచుతున్నట్టు తెలిపారు. ఇక పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎలిసా టెస్ట్ నిర్వహించకుండానే డెంగ్యు వ్యాధిగా ప్రకటిస్తున్నారని.. ఇది చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల నుండి నిర్ధారణ అయిన డెంగ్యు వివరాల జాబితా వైద్య ఆరోగ్య శాఖకు ఇప్పటి వరకు అందలేదని పేర్కొన్నారు. గ్రేట‌ర్​లోని 6 వేల‌కు పైగా పాఠ‌శాల‌లో అంటువ్యాధులు, దోమ‌ల నివార‌ణ‌పై విద్యార్థులకు అవ‌గాహ‌న‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ‌ని వివరించారు.

గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో 695 హెల్త్​ క్యాంపులు

ఇవీ చూడండి: విద్యుత్​పై సీబీఐ విచారణకు సిద్ధం: ట్రాన్స్​కో సీఎండీ

ABOUT THE AUTHOR

...view details