తెలంగాణ

telangana

ETV Bharat / state

Harish Rao On Medical Colleges : 'పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందిచటమే లక్ష్యం' - తెలంగాణలో 8 మెడికల్​ కాలేజీల నిర్మాణం

Harish Rao On Medical Colleges : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఎనిమిది వైద్యకళాశాలల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు అధికారులను ఆదేశించారు. నిర్మాణ పురోగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో మంత్రి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

Harish Rao On Medical Colleges
Harish Rao On Medical Colleges

By

Published : Feb 9, 2022, 9:01 PM IST

Harish Rao On Medical Colleges : రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న 8 వైద్య కళశాలల నిర్మాణ పనుల పురోగతిపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు అధికారులతో సమీక్షించారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భ‌ద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో కళాశాలల నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకున్నారు. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకో వైద్యకళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆ క్రమంలో కొత్తగా ఎనిమిది జిల్లాల్లో కళాశాలలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.

వైద్యకళాశాలల నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్న మంత్రి... ఎన్ఎంసీ నిబంధనల మేరకు నిర్మాణాలు ఉండాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దని స్పష్టం చేశారు. ఆధునిక పద్ధతుల్లో నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ... నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు. పనుల పురోగతిని రోజు వారీ సమీక్షించాలని... భవన నిర్మాణ పనులు పూర్తైన చోట కళాశాల నిర్వహణకు అవసరమైన మౌలికసదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు ప్రతి వైద్యకళాశాలకు ఒక ఇంజినీరింగ్ అధికారిని కేటాయించాలని ఆదేశించారు.

ఇదీ చూడండి :KTR Help To Sabitha: సబితకు మంత్రి కేటీఆర్ సాయం

ABOUT THE AUTHOR

...view details