యూరాలజీ వైద్యనిపుణుల డాక్టర్ లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో కొత్తపేటలో ఏర్పాటు చేసిన 50 పడకల ఆస్పత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు.
'అవగాహన ఉంటే ఏ వ్యాధులనైనా ఎదుర్కోవచ్చు' - hyderabad latest news
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు తీసుకుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ కొత్తపేటలో ఏర్పాటు చేసిన యూరాలజీ, ఆండ్రాలజిస్ట్ టెక్టాలజీ విభాగానికి చెందిన ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు.
ఎల్బీనగర్లో 50 పడకల ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి ఈటల
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కాకుండా అనేక అవగాహన కార్యక్రమాలు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ అనిత పలువురు వైద్యులు పాల్గొన్నారు.