తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమాలు జరిగితే ఎవరినీ ఉపేక్షించం... - గాంధీ ఆసుపత్రి ఘటనపై సమగ్రమైన నివేదిక

గాంధీ ఆసుపత్రిలో జరుగుతున్న వ్యవహారాలపై ఎప్పటికప్పుడు తమకు నివేదికలు వస్తున్నట్లు మంత్రి ఈటల తెలిపారు. తుది నివేదికలో ఎవరైన అక్రమాలకు పాప్పడినట్లు తేలితే ఎవరిని వదలబోమని స్పష్టం చేశారు. డాక్టర్ వసంత్ ఆత్మహత్యాయత్నం ఎపిసోడ్​పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

health minister etala rajendar speaks on gandhi issue
అక్రమాలు జరిగితే ఎవరినీ ఉపేక్షించం...

By

Published : Feb 15, 2020, 4:37 PM IST

గాంధీ ఆసుపత్రిలో కొద్దిరోజులుగా జరుగుతున్న వ్యవహారాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ఆసుపత్రిలో అక్రమాలు జరిగితే ఎవరిని ఉపేక్షించమని తేల్చిచెప్పారు. డాక్టర్ స్థాయిలో ఉండి వసంత్ ఆత్మహత్యకు యత్నించడం సరికాదన్నారు. ఆసుపత్రిలో జరుగుతున్న అంశాలపై ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నాయని ఈటల తెలిపారు. ఇక్కడ జరిగిన అంశాపై త్వరలోనే సమగ్రమైన నివేదిక రానుంది. నివేదికలో అక్రమాలకు పాప్పడినట్లు తేలితే ఎవరిని వదలబోమని స్పష్టం చేశారు.

ఇవాళ గాంధీ ఆసుపత్రిలో సమీక్ష సమావేశం ఉందని.. అందులో అవకతవకలపై దృష్టి పెడతామని పేర్కొన్నారు.

అక్రమాలు జరిగితే ఎవరినీ ఉపేక్షించం...

ఇదీ చూడండి:పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడు... పోలింగ్​ కేంద్రానికి వచ్చాడు

ABOUT THE AUTHOR

...view details