ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌కు తెలంగాణలో వ్యాక్సిన్ తయారు కావడం గర్వకారణమని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కో వాగ్జిన్‌ను ముందుగా తెలంగాణ ప్రజలకివ్వాలని ఈటల కోరారు.
రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ తయారు కావడం గర్వకారణం: ఈటల
హైదరాబాద్ కేంద్రంగా దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారత్ బయోటెక్ కో వాగ్జిన్ తయారు చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వ్యాక్సిన్‌ను ముందుగా తెలంగాణ ప్రజలకివ్వాలని ఈటల కోరారు.
రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ తయారు కావడం గర్వకారణం: ఈటల
తెలంగాణ గడ్డ మీద వ్యాక్సిన్ తయారవుతుంది కాబట్టి.. ఆ ఫలితం ఇక్కడి ప్రజలకు ముందుగా అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి ప్రజలకు సరిపోయే డోస్‌లను ముందుగా ఇవ్వాలని కోరారు. ఈ రోజు భారత్ బయోటెక్‌ని సందర్శించేందుకు ప్రధాని మోదీ వస్తున్న సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి: పోలింగ్ శాతం పెరిగేలా ఓటర్లను చైతన్యం చేయండి : పార్థసారథి