వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి ఈటల సమీక్ష - అధికారులతో మంత్రి ఈటల సమావేశం
11:02 April 01
కొవిడ్ కట్టడి చర్యలపై అధికారులతో మంత్రి ఈటల సమావేశం
రాష్ట్రంలో రెండోదశ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇవాళ అత్యధికంగా 887 కేసులు నమోదైన నేపథ్యంలో మహమ్మారి కట్టడిపై ప్రభుత్వం దృష్టి సారించింది.
కొవిడ్ కట్టడి చర్యలపై అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. కోఠిలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సమావేశం జరుగుతోంది. కొవిడ్ కేసులు, ఆస్పత్రుల్లో పడకలు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు.
ఇదీ చూడండి:ఒకే ఇంట్లో 13 మందికి కరోనా పాజిటివ్