గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగుల కోసం తీసుకున్న చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్షించారు. అత్యవసర చికిత్స అవసరమైన రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోగిని బతికించేందుకు ప్రయత్నించాలని సూచించారు. ప్రస్తుతం 30 మంది బాధితులు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు మంత్రికి డాక్టర్ రాజారావు వివరించారు.
ప్రతి రోగిని బతికించేందుకు ప్రయత్నించండి: ఈటల - తెలంగాణ కరోనా వార్తలు
రాష్ట్రంలో కోరనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గాంధీలో వైద్య సేవలపై మంత్రి ఈటల సమీక్షించారు. ఆస్పత్రిలోని ఏర్పాట్లపై సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పలు సూచనలు చేశారు.
ప్రతి రోగిని బతికించేందుకు ప్రయత్నించండి: ఈటల
రోగుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన మంత్రి.... క్లిష్ట పరిస్థితిలో ఉన్న వాళ్ల వివరాలు ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని సూచించారు. రోగులకు నాణ్యమైన భోజనం, ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కోరారు.
ఇవీ చూడండి: కరోనా కేసుల పెరుగుదలకు కారణాలివే!