తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి పచ్చజెండా - health deportment posts

వైద్యఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొత్తగా నెలకొల్పిన నల్గొండ, సూర్యాపేట వైద్య కళాశాల్లో ఇప్పటికే పోస్టులు మంజూరు చేశారు. ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ ఎంజీఎంలో మంజూరుకు రంగం సిద్ధమైంది.

వైద్యఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి పచ్చజెండా

By

Published : Jun 20, 2019, 7:31 AM IST

Updated : Jun 20, 2019, 10:22 AM IST

వైద్యఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి పచ్చజెండా

వైద్యఆరోగ్యశాఖలో కొత్తగా 3 వేల 175 పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నల్గొండ, సూర్యాపేట వైద్య కళాశాలల్లో 1189 పోస్టుల చొప్పున ఇప్పటికే మంజూరు చేసింది. ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రుల్లో పోస్టులకు ఆమోదం తెలపాల్సి ఉంది. ప్రధానమంత్రి స్వస్థ్య సురక్షా యోజన కింద నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పోస్టులకు ప్రతిపాదనలు పంపారు. వైద్యులు 980, నర్సులు, పారామెడికల్ సిబ్బంది 2,195 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక 11 వేల కొత్త పోస్టులు మంజూరు చేయగా... 3,175 పోస్టులకు పచ్చజెండా ఊపడం విశేషం.

Last Updated : Jun 20, 2019, 10:22 AM IST

ABOUT THE AUTHOR

...view details