కరోనా వైరస్ చికిత్స కోసం గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డును వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, ఇతర ఉన్నత అధికారులు పరిశీలించారు. కరోనా వైరస్ గురించి తీసుకుంటున్న చర్యలపై వైద్యులతో చర్చించారు. హెల్త్ ఎమర్జెన్సీ కారణంగా ప్రతి ఒక్కరు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు.
'కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం...' - గాంధీ ఆస్పత్రిలో కరోనా ప్రత్యేక వార్డును పరిశీలించిన అధికారులు
కరోనా వైరస్ చికిత్సకు సంబంధించి గాంధీ ఆస్పత్రిలో తీసుకుంటున్న ముందస్తు చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి ఆరా తీశారు. గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా వైరస్ ప్రత్యేక వార్డును డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డితో కలిసి పరిశీలించారు.

కరోనా ప్రత్యేక వార్డును పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు
గాంధీలో కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా పది పడకలతో... ఐసీయూని ఏర్పాటు చేస్తున్నట్టు డీఎంఈ రమేష్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కానప్పటికీ... ముందస్తు చర్యల్లో భాగంగా... రోగులను వార్డులకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు.
కరోనా ప్రత్యేక వార్డును పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు