తనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ మంత్రి, తెదేపా శాసనసభ ఉపనేత, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిన పరీక్షల్లో కడుపులో అల్సర్ కణాలు ఉన్నాయని వైద్యులు గుర్తించినట్లు అచ్చెన్న తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
'అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది' - అచ్చెన్నాయుడు కేసు వార్తలు
ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో అవకతవకల కేసులో అరెస్టయి జైలులో ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ముగిసింది. అచ్చెన్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై తీర్పు ప్రకటనను న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది.
'అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది'
మరోవైపు అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిపై నివేదికను ఏపీ ప్రభుత్వం న్యాయస్థానంలో దాఖలు చేసింది. ఆయనను ఆసుపత్రికి తరలించే అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. కేసును బుధవారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి :కక్ష సాధింపుతోనే బీసీ నేతల అక్రమ అరెస్టులు: దేవినేని