తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం నేతలు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆమె క్యాంపు కార్యాలయంలో కలిశారు. ప్రధానోపాధ్యాయుల, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు తదితర అంశాలపై 16 పేజీల వినతిపత్రాన్ని అందజేశామని అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాష్, ప్రధానకార్యదర్శి రాజ గంగారెడ్డిలు పేర్కొన్నారు.
Minister Sabitha: ఉపాధ్యాయుల సమస్యలపై మంత్రి సబితకు వినతి - సమస్యలపై మంత్రిని కలిసి ఉపాధ్యాయులు
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు తదితర అంశాలపై గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం నేతలు మంత్రి సబితారెడ్డికి వినతిపత్రం అందజేశారు. మెయిల్ ద్వారా మంత్రి కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు.
ఉపాధ్యాయుల సమస్యలపై మంత్రి సబితకు వినతి
అనంతరం ఎమ్మెల్సీలు కూర రఘోత్తమ రెడ్డి, కాటేపల్లి జనార్దన్ రెడ్డిలను కలిసి సమస్యలు పరిష్కరించడానికి కృషిచేయాలని కోరినట్లు వెల్లడించారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు మెయిల్ ద్వారా సమాచారాన్ని తెలియజేసి... అన్ని ఉన్నత పాఠశాలలకు కంప్యూటర్లు, ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశామన్నారు.
ఇదీ చదవండి:'ఈ నెల 10లోపు ధరణిలో చేరిన రైతులకు నగదు జమ'