తెలంగాణ

telangana

ETV Bharat / state

కడుపులో మోసిన తల్లిని... వీపున మోసిన తనయుడు - CORONA EFFECT

నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిని.. కుమారుడు వీపుపైన ఎత్తుకుని రెండు గంటల పాటు వైద్యం కోసం ప్రైవేట్‌ ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. మండుతున్న ఎండలో ఆ తనయుడు పడ్డ వేదన చూపరులను కలిచివేసింది. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చోటుచేసుకుంది.

ananthapuram lockdown news
కడుపులో మోసిన తల్లిని... వీపున మోసిన తనయుడు

By

Published : May 1, 2020, 2:09 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురదకుంటకి చెందిన రామక్కకు 3 రోజుల నుంచి జ్వరంగా ఉంది. తల్లిని తీసుకుని ఆమె కుమారుడు రవి గురువారం రోజను ఆటోలో వచ్చాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఆటో కళ్యాణదుర్గంలోకి రాలేదు. చేసేదేమీ లేక మాతృమూర్తిని వీపున ఎత్తుకుని ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. వైద్యులు అందుబాటులో లేకపోవటం వల్ల... చివరికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని వెనుదిరిగారు.

కడుపులో మోసిన తల్లిని... వీపున మోసిన తనయుడు

ABOUT THE AUTHOR

...view details