పని చేస్తోన్న సంస్థనే బురిడీ కొట్టి 80 లక్షల రూపాయలు కాజేసిన వ్యక్తిని బాలానగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతని నుంచి 3లక్షల రూపాయలు, మారుతి స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా బాలానగర్ పారిశ్రామిక వాడలో ఓని ఐస్లాండ్ వీర రసాయన పరిశ్రమలో సత్య జగన్నాథం అనే వ్యక్తి యాజమాన్యానికి నమ్మకంగా పనిచేసేవాడు. డబ్బు కాజేయాలనే ఉపాయంతో తానే కంపెనీ యజమాని అని బ్యాంక్ అధికారులకు నమ్మపలికాడు. నకిలీ పత్రాలు సృష్టించి సంస్థకు చెందాల్సిన 80లక్షల రూపాయలను తన వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకున్నాడు. ఈ మోసాన్ని గుర్తించిన సంస్థ డైరెక్టర్ వెంకట నరసింహరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు.
నమ్మకంగా పనిచేస్తునట్టు నటించి రూ.80లక్షలు కాజేశాడు - Cheating Person Arrest
మేడ్చల్ జిల్లా బాలానగర్‌లో పని చేస్తోన్న సంస్థనే బురిడీ కొట్టి రూ.80లక్షలు కాజేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
నమ్మకంగా పనిచేస్తునట్టు నటించి రూ.80లక్షలు కాజేశాడు