తెలంగాణ

telangana

ETV Bharat / state

దూరవిద్య విధానంలో డిప్లొమా కోర్సును అందించనున్న హెచ్​సీయూ - diploma course in Hyderabad Central University

నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్​మెంట్​తో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కలిసి పని చేయనుంది. దూరవిద్య విధానంలో ఒక సంవత్సరం డిప్లొమా కోర్సును అందించనుంది.

హెచ్​సీయూ
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం

By

Published : Apr 9, 2021, 10:46 PM IST

ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్​కు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్​మెంట్​తో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కలిసి పని చేయనుంది. సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ వర్చువల్ లెర్నింగ్ వ్యవసాయంలో సాంకేతిక నిర్వహణ గురించి దూరవిద్య విధానంలో ఒక సంవత్సరం డిప్లొమా కోర్సును అందించనుంది.

టెక్నాలజీ మేనేజ్​మెంట్​ ఇన్ అగ్రికల్చర్​గా పిలుస్తోన్న ఈ కోర్సుకు మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విశ్వవిద్యాలయం ప్రకటించింది. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, న్యాయ సంబంధ సంస్థలు తదితరాలతో చర్చించి కోర్సు పాఠ్యాంశాలు తయారు చేశామని పేర్కొంది. మేధో సంపత్తి హక్కులు, నవకల్పనలు, గ్రామీణ నవకల్పనల లాంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి: హైదరాబాద్‌లో కొత్తగా 4 కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details