రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ముందు జాతీయ పౌర పట్టిక, పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'రాజ్యాంగానికి వ్యతిరేకం.. బిల్లును వెనక్కి తీసుకోండి' - హెచ్‌సీయూ విద్యార్థుల ధర్నా
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పౌరసత్వ బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ ధర్నా నిర్వహించారు.
'రాజ్యాంగానికి వ్యతిరేకం.. బిల్లును వెనక్కి తీసుకోండి'
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కి ధర్నాగా వెళ్తున్న 50మంది విద్యార్థులను పోలీసుల అదుపులోకి తీసుకుని మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. విద్యార్థులు దీనిని ఖండిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుటే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు అక్రమంగా మమ్మల్ని అరెస్టు చేసి ఇక్కడికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: హైదరాబాద్‌లో 'పౌర' సెగ: వామపక్ష నేతల అరెస్ట్