తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసియా ఉత్తమ శాస్త్రవేత్తల్లో హెచ్‌సీయూ ఆచార్యుడు - ఆసియాలో బెస్ట్​ 100 మంది శాస్త్రవేత్తల జాబితా

హైదరాబాద్‌ కేంద్రియ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్​కు అరుదైన గుర్తింపు లభించింది. ఆసియాలో బెస్ట్​ 100 మంది శాస్త్రవేత్తల జాబితాలో ఆయన చోటు సంపాదించారు. ప్రస్తుతం డాక్టర్‌ సురజిత్‌దారా హెచ్‌సీయూలో భౌతికశాస్త్రం విభాగం ప్రొఫెసర్​గా కొనసాగుతున్నారు.

HCU Professor doctor surajit dhara, best scientists in Asia
ఆసియా ఉత్తమ శాస్త్రవేత్తల్లో హెచ్‌సీయూ ఆచార్యుడు

By

Published : May 2, 2021, 7:54 AM IST

ఆసియా ఉత్తమ వంద మంది శాస్త్రవేత్తల జాబితాలో హైదరాబాద్‌ కేంద్రియ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) ఆచార్యుడికి చోటు లభించింది. వర్సిటీలోని భౌతికశాస్త్రం విభాగం ఆచార్యుడు డాక్టర్‌ సురజిత్‌దారా ఈ గౌరవం పొందారు. 2016 నుంచి ఏటా ఆసియా శాస్త్రవేత్తల మ్యాగజైన్‌ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు చేస్తున్నారు.

చోటు దక్కించుకోవాలంటే శాస్త్రవేత్త అంతకు ముందు ఏడాదిలో జాతీయ లేదా అంతర్జాతీయ పురస్కారం దక్కించుకోవడంతోపాటు శాస్త్ర పరిశోధన రంగంలో ఆవిష్కరణలు చేసుండాలి. ఇటీవల డా.సురజిత్‌దారా శాస్త్ర, సాంకేతిక విభాగంలో ప్రతిష్ఠాత్మక శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు-2020ను దక్కించుకున్నారు. 2015లో స్వర్ణ జయంతి ఫెలోషిప్‌ అవార్డు, 2013లో వర్సిటీ కులపతి అవార్డు, 2012లో భారత భౌతికశాస్త్ర సంఘం నుంచి ఎన్‌ఎస్‌ సత్యమూర్తి మెమోరియల్‌ అవార్డులను కూడా అందుకున్నారు.

ఇదీ చూడండి:మే 31వరకు ఎర్లీ బర్డ్ పథకం గడువు పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details