నూతన విద్యా విధానానికి అనుగుణంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అకడమిక్ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంఫిల్ కోర్సులు రద్దు కానున్నాయి. యూనివర్సిటీలోని 12 స్కూల్స్లో మూడు.. ప్రస్తుతం ఎంఫిల్ కోర్సులు అందిస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటిని నిలిపివేయనుంది. విదేశీ విశ్వవిద్యాలయాలతో కలిసి సంయుక్త పీహెచ్డీ కోర్సులు ప్రవేశపెట్టేందుకు కౌన్సిల్ ప్రాథమికంగా అనుమతినిచ్చింది.
కొత్తగా స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ మీడియా స్టడీస్
ఇప్పటికే ఆరు దేశాల యూనివర్సిటీలతో చర్చలు జరుపుతున్న హెచ్సీయూ, ప్రవేశప్రక్రియ, అర్హతలు, తదితర విధివిధానాలను రూపొందించనుంది. సంయుక్త పీహెచ్డీ వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి రాకపోవచ్చునని.. ఆ తర్వాత సంవత్సరానికి సిద్ధం కావచ్చునని హెచ్సీయూ వీసీ ప్రొఫెసర్ అప్పారావు తెలిపారు. ఇప్పటికే 13 స్కూల్స్ నిర్వహిస్తున్న హెచ్సీయూ.. కొత్తగా స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ మీడియా స్టడీస్ ఏర్పాటు చేయాలని నిర్ణయిచింది.