తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Oct 20, 2023, 3:00 PM IST

ETV Bharat / state

HCA Elections 2023 Today : ప్రశాంతంగా హెచ్​సీఏ ఎన్నికల పోలింగ్.. సాయంత్రం ఫలితాలు

HCA Elections 2023 Today : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎలక్షన్​ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10 గంటలకు మొదలైన పోలింగ్.. మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. మొత్తం 173 మంది సభ్యులు.. తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాలుగు ప్యానెళ్లు పోటీకి దిగాయి. మొత్తంగా బీఆర్​ఎస్​, బీజేపీ మద్దతుదారుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

Hyderabad Cricket Association Funds Scam
HCA Elections 2023 Today

HCA Elections 2023 Today :ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA Elections) ఎలక్షన్​ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మొత్తంగా 173 మంది సభ్యులు.. తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ​పోటీ ప్రధానంగా బీఆర్​ఎస్​, బీజేపీ మద్దతుదారుల మధ్యే నెలకొంది. జగన్మోహనరావు యూనైటెడ్ మెంబెర్స్ ఆఫ్ హెచ్​సీఏ ప్యానెల్ పేరుతో బరిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తనకే ఉందని.. జగన్మోహనరావు పేర్కొంటున్నారు.

Hyderabad Cricket Association Funds Golmaal : హెచ్​సీఏలో నిధుల గోల్​మాల్.. ఉప్పల్ పీఎస్​లో ఒకేసారి నాలుగు కేసులు నమోదు

Hyderabad Cricket Association Elections 2023 :గుడ్ గవర్నెన్స్ ప్యానెల్ పేరుతో.. అనిల్ కుమార్ ప్యానల్ పోటీలో ఉన్నారు. ఇయన హెచ్​సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్ మద్దతుతో అధ్యక్షుడిగా బరిలో ఉన్నారు. క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ పేరుతో శివలాల్ యాదవ్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అర్షద్ ఆయూబ్ ప్యానల్ తరపున అమర్నాథ్ బరిలో నిలిచారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్ పదవులకుఎన్నికలు జరగనున్నాయి. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నారు.

నాలుగు ప్యానల్స్ పోటీ చేస్తుండగా.. ప్రధానంగా త్రిముఖ పోరు జరగనున్నట్లు తెలుస్తోంది. యునైటెడ్ మెంబెర్స్ ఆఫ్ హెచ్​సీఏ, గుడ్ గవర్నెన్స్ ప్యానల్, క్రికెట్ ఫస్ట్ అనే ప్యానెల్స్ మధ్య రసవత్తర పోరు జరగనుంది. యూనైటెడ్ మెంబెర్స్ ఆఫ్ హెచ్​సీఏ ప్యానల్‌కు అధికార బీఆర్ఎస్(BRS Party) మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.

Hyderabad Cricket Association Funds Scam :ఉప్పల్‌ స్టేడియంలో సామగ్రి కొనుగోళ్ల అవకతవకలపై.. ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసులో నమోదయ్యాయి. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై మూడు, మాజీ కార్యదర్శి విజయానంద్‌, మాజీ కోశాధికారి సురేందర్‌ అగర్వాల్‌పై రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ అవకతవకలతో సంబంధం ఉన్న ఫైర్‌ విన్‌ సేఫ్టీ ఇంజినీర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సారా స్పోర్ట్స్‌, బాడీ డ్రెంచ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎక్సలెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తదితర నాలుగు సంస్థల పేర్లను పోలీసులు ఎఫ్​ఐఆర్​లో చేర్చారు.

అగ్నిమాపక సామగ్రి కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని.. అప్పట్లో న్యాయస్థానం నియమించిన జస్టిస్‌ నిసార్‌ అహ్మద్‌ కక్రూ పర్యవేక్షక కమిటీ దృష్టికి రాకుండానే కాంట్రాక్టు ఇచ్చారని పోలీసులు ఎఫ్​ఐఆర్​లో పేర్కొన్నారు. బంతుల కొనుగోళ్లకు సంబంధించి హెచ్​సీఎకు 57.07 లక్షల నష్టం వాటిల్లినట్లు, జిమ్‌కు సంబంధించి ట్రెడ్‌మిల్‌, ఇతర సామగ్రి నాసిరకంగా ఉన్నట్లు పొందుపరిచారు. బకెట్‌ కుర్చీల కొనుగోళ్లలో ధరల పెంపుతో రూ.43.11 లక్షల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

ODI World Cup 2023 Hyderabad Schedule : ఉప్పల్‌ మ్యాచ్‌ రీ షెడ్యూల్‌ పై స్పందించిన బీసీసీఐ!

Rachakonda Police Instructions to HCA Representatives : 'వార్మప్‌ మ్యాచ్‌కు ప్రేక్షకులను వద్దు..' హెచ్​సీఏకు పోలీసుల సూచన

ABOUT THE AUTHOR

...view details