తెలంగాణ

telangana

By

Published : Dec 21, 2019, 4:12 PM IST

ETV Bharat / state

'నిర్మాణరంగంలో మధ్యవర్తిత్వానికి ప్రత్యేక నైపుణ్యం అవసరం'

హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగంలో మధ్యవర్తిత్వం అనే అంశంపై ఐసీఏడీఆర్‌, క్రెడాయి, బిల్డింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా సదస్సు నిర్వహించాయి.

Hc judge inauguarated seminar in hyderaba
నిర్మాణ రంగంలో మధ్యవర్తిత్వం అనే అంశంపై సదస్సు

మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగంలో మధ్యవర్తిత్వం అనే అంశంపై ఐసీఏడీఆర్‌, క్రెడాయి, బిల్డింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించారు. నాంపల్లిలోని ఐసీఏడీఆర్‌ ప్రాంతీయ కేంద్ర కార్యాలయంలో సదస్సును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరాం ప్రారంభించారు.

నిర్మాణ మౌలిక రంగాలకు ప్రోత్సాహమివ్వడానికి, మధ్యవర్తిత్వానికి అవసరమైన సంస్కరణలను అన్వేషించడం తద్వారా దేశాన్ని జాతీయ, అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంగా మార్చడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. మధ్యవర్తిత్వ రంగంలో ప్రత్యేక నైపుణ్యం సమర్థవంతమైన పనితీరు ద్వారా లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు.

వ్యాపార, వాణిజ్య రంగాల్లో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతులు ప్రయోజనాన్ని పొందాయన్నారు. ఈ సదస్సులో ఐసీఏడీఆర్‌ ప్రాంతీయ కేంద్రం ఇంఛార్జి, కార్యదర్శి జేఎన్‌ఎన్‌ మూర్తి, సభ్యుడు శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిర్మాణ రంగంలో మధ్యవర్తిత్వం అనే అంశంపై సదస్సు

ఇవీ చూడండి: ఆర్టీసీ పట్ల నమ్మకం కలిగించేందుకే బస్సు ప్రయాణం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details