తెలంగాణ

telangana

ETV Bharat / state

Hayathnagar Minor Girl Rape Attempt Case : హయత్ నగర్​ ఘటనలో బాలికపై అత్యాచారం జరగలేదన్న డీసీపీ - హయత్​నగర్​లో మైనర్​ బాలికపై అత్యాచారానికి యత్నం

Rape Attempt on Minor Girl Case Update : హైదరాబాద్ శివారులో బాలికను కిడ్నాప్​ చేసి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనకు సంబంధించి ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ కీలక విషయాలు వెల్లడించారు. కిడ్నాప్‌నకు గురైన బాలికపై అత్యాచారం జరగలేదని డీసీపీ తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఆమె వివరించారు.

Rape Attempt on Minor Girl
Rape Attempt on Minor Girl

By

Published : Jul 5, 2023, 7:34 PM IST

Hayathnagar Minor Girl Rape Attempt Case Update : హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో మంగళవారం అర్ధరాత్రి ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి యత్నించి ఘటన చోటుచేసుకుంది. నగర శివారులోని ఔటర్​రింగ్ రోడ్డు సమీపంలో బాలిక జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా.. పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక కిడ్నాప్ కేసుకు సంబంధించిన వివరాలను ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు.

LB Nagar DCP Saisri on Minor Girl Rape Attempt Case : హయత్‌నగర్‌లో కిడ్నాప్‌నకు గురైన బాలికపై అత్యాచారం జరగలేదని డీసీపీ సాయిశ్రీ తెలిపారు. తమకు 100 డయల్ ద్వారా సమాచారం వచ్చిందని.. వెంటనే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారని ఆమె వెల్లడించారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మైనర్ అమ్మాయి పనిమీద వెళ్లేందుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చింది... అప్పుడే బైక్ మీద వచ్చిన ఓ వ్యక్తి అడ్రస్‌ అడిగినట్టు అడిగి బాలికను బలవంతంగా తీసుకెళ్లాడని డీసీపీ పేర్కొన్నారు. మరో వ్యక్తి కొద్దిదూరం వెళ్లాక బైక్‌పై ఎక్కాడు... రింగ్‌రోడ్డు వద్దకు బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేయబోయారని సాయిశ్రీ తెలిపారు.

నిందితుల కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నాం : ఆ సమయంలో బాలిక ప్రతిఘటించి సమీపంలో ఉన్న హోటల్‌ వద్దకు వెళ్లిందని డీసీపీ పేర్కొన్నారు. అక్కడి నుంచి పారిపోయి వచ్చే క్రమంలో ముళ్ల కంచె తగిలి బాలికకు గాయాలయ్యాయని ఆమె తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్న సాయిశ్రీ.. నిందితుల కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని కేసు దర్యాప్తు కొనసాగుతోంది అని డీసీపీ వివరించారు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుందనీ.. నిందితులు దొరికిన అనంతరం ఏం జరిగిందనే వాస్తవాలను మీడియాకు తెలుపుతామన్నారు. బాలిక కొద్ది రోజుల క్రితమే అంబర్​పేటలో ఉండే తల్లిదండ్రుల వద్దకు వచ్చిందనీ, బాలిక తల్లిదండ్రులు ఒక ఇంటికి వాచ్​మెన్​గా పనిచేస్తున్నారని డీసీపీ సాయిశ్రీ తెలిపారు.

'బాలికపై ఎలాంటి అత్యాచారం జరగలేదు. రాత్రి 10 గం. సమయంలో బాలిక బయటకు వచ్చింది. బైక్‌పై వచ్చి అడ్రస్‌ అడిగినట్లు చేసి బాలికను బలవంతంగా తీసుకెళ్లాడు. మరో వ్యక్తి కొద్దిదూరం వెళ్లాక బైక్ పై ఎక్కాడు. రింగ్‌రోడ్డు వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేయబోయారు. బాలిక ప్రతిఘటించి సమీపంలో ఉన్న హోటల్ వద్దకు వెళ్లింది. పారిపోయి వచ్చే క్రమంలో పొదలు తాకి గాయాలయ్యాయి. నిందితుల కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయి.'-సాయిశ్రీ, ఎల్బీనగర్ డీసీపీ

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details