హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని ఆయన నివాసంలో పరామర్శించారు. హైదరాబాద్‌కు వచ్చిన దత్తాత్రేయ.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
గత కొంత కాలం నుంచి సురవరం సుధాకర్ రెడ్డి ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనను కలిసేందుకు వచ్చిన దత్తాత్రేయ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇటీవలే హరియాణా గవర్నర్‌గా బదిలీ..
కేంద్ర కేబినెట్ పునర్విభజన నేపథ్యంలో కేంద్రం.. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. మరికొన్ని రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేసింది. హరియాణా గవర్నర్ సత్యదేవ్ ఆర్యా.. త్రిపురకు బదిలీ కాగా ఆయన స్థానంలో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను నియమించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నియమితులయ్యారు. మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబును మిజోరాం గవర్నర్‌గా నియమించిన సంగతి తెలిసిందే.
1980లో తెలంగాణ భాజపా రాష్ట్ర కార్యదర్శిగా మొదలైన దత్తాత్రేయ(Bandaru Dattatreya) ప్రస్థానం.. ఆ తర్వాత ఏళ్లలో.. పలుమార్లు ఎంపీగా, రెండు సార్లు కేంద్రమంత్రిగా గెలిచేలా సాగింది. 2019లో కేంద్రం.. ఆయణ్ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించగా.. తాజా పరిణామాల నేపథ్యంలో.. దత్తాత్రేయ(Bandaru Dattatreya) హరియాణా గవర్నర్‌గా బదిలీ అయ్యారు.