Harvard University Invitation to KTR: వచ్చే ఫిబ్రవరిలో బోస్టన్ వేదికగా జరగనున్న ఇండియా సదస్సులో ప్రసంగించాలని మంత్రి కేటీఆర్‌ను (KTR) హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఆహ్వానించింది. ఇండియా రైజింగ్ - బిజినెస్, ఎకానమీ, కల్చర్ థీమ్‌తో ఇండియా సదస్సు 21వ ఎడిషన్‌ను హార్వర్డ్ నిర్వహించనుంది. 2024 ఫిబ్రవరి 18న ఈ సదస్సు జరగనుంది. అమెరికాలో విద్యార్థులు నిర్వహించే పెద్ద సదస్సు అయిన ఇండియా కాన్ఫరెన్స్‌లో.. మన దేశానికి సంబంధించిన వెయ్యి మందికి పైగా విధాన నిపుణులు, బిజినెస్ లీడర్స్, విద్యావేత్తలు, విద్యార్థులు ఇందులో పాల్గొననున్నారు.
KTR Invited To Harvard 21st Edition at America :గతంలో అమర్త్యసేన్, అజీం ప్రేమ్ జీ, అనామికా ఖన్నా లాంటి వారితో పాటు.. పలువురు మంత్రులు, బిజినెస్ లీడర్స్, విద్యావేత్తలు సదస్సులో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధిలో కేటీఆర్నాయకత్వం కీలకపాత్ర పోషించిందని.. పెట్టుబడులకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా తీర్చిదిద్దారని హార్వర్డ్ విశ్వవిద్యాలయం (Harvard University) ఆహ్వానంలో పేర్కొంది. ఆహ్వానం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్.. తెలంగాణ అభివృద్ధి విధానాలను వివరించేందుకు సదస్సు మంచి వేదిక అని అన్నారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలను కూడా వివరించవచ్చని ఆయన తెలిపారు.
KTR Laid Foundation Eurofins Campus : 'ఉపాధి, ఉద్యోగ కల్పన, సంపదను సృష్టించటమే నేతల ముందున్న సవాల్'
ఇటీవలే మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ అహ్వానం అందింది. ప్రపంచ హరిత విప్లవ పితమహుడు నార్మన్ బోర్లాగ్ పేరు మీదుగా నిర్వహిస్తున్న బోర్లాగ్ ఇంటర్నేషనల్ సమావేశంలో.. తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రసంగించాల్సిందిగా సంస్థ ప్రతినిధులు.. కేటీఆర్‌ను ఆహ్వానించారు. రాష్ట్ర అనుభవాలను చర్చించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా బోర్లాగ్ ఇంటర్నేషనల్ సమావేశాలకు హాజరవుతున్న అనేక మందికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని.. కేటీఆర్‌కు పంపిన ఆహ్వాన పత్రంలో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అధ్యక్షుడు టెర్రీ బ్రాన్‌స్టాడ్ పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయరంగ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను సమావేశంలో ప్రసంగించాలని కోరారు.