రేపటి నుంచి హరిత పండగ.. 29.86 కోట్ల మొక్కలు లక్ష్యం
తెలంగాణను పర్యావరణానికి దగ్గరగా తీసుకెళ్లటమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఐదేళ్లుగా నిర్వహిస్తున్న హరితహారం ఆరో విడతకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది 29.86 కోట్ల మొక్కలు నాటడంతోపాటు వాటిలో 85 శాతం వరకు బతికేలా చర్యలు తీసుకోడానికి అటవీశాఖ ప్రణాళిక రూపొందించింది.
రేపటి నుంచి హరిత పండగ.. 29.86 కోట్ల మొక్కలు లక్ష్యం
ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఐదేళ్లుగా నిర్వహిస్తున్న హరితహారం ఆరో విడతకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. గురువారం నుంచి హరితహారం ప్రారంభం కానుంది. దాదాపు 34 ప్రభుత్వశాఖలు పాల్గొనే ఈ కార్యక్రమంలో ఈ ఏడాది 29.86 కోట్ల మొక్కలు నాటడంతోపాటు వాటిలో 85 శాతం వరకు బతికేలా చర్యలు తీసుకోడానికి అటవీశాఖ ప్రణాళిక రూపొందించింది.
ఈసారి ప్రత్యేకతలు..
- పట్టణాల్లో యాదాద్రి మోడల్ (దగ్గర దగ్గరగా) చిట్టడవులను పెంచడం. హెచ్‌ఎండీఏ పరిధిలో 5 కోట్లు, జీహెచ్‌ఎంసీలో 2.5 కోట్లు, మిగతా పట్టణ ప్రాంతాల్లో 5 కోట్ల మొక్కల పెంపకం
- అన్ని పట్టణ ప్రాంతాలకు సమీపంలో అర్బన్ పార్కుల ఏర్పాటు
- ప్రతి ఊరిలో చిన్నచిన్న పార్కులు..
- క్షీణించిన అటవీ ప్రాంతాల్లో కోతుల బెడద నివారణకు మంకీ ఫుడ్ కోర్టుల పేరుతో 37 రకాల పండ్ల మొక్కల పెంపకం
- చిన్న, సన్నకారు రైతులకు ఆదాయ వనరుగా వెదురు పెంపకం
- 95 అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ల అభివృద్ధి (ఇప్పటికే 35 పూర్తి)