తెలంగాణ

telangana

ETV Bharat / state

కోఠి ఈఎన్​టీ ఆస్పత్రిలో హరితహారం - తెరాస నాయకులు ఆనంద్​ కుమార్​ గౌడ్

ఒక మొక్క నాటితే.. ఆరోగ్యం వైపు ఒక అడుగు వేసినట్టే అని కోఠి ఈఎన్​టీ ఆస్పత్రి ఆర్ఎంవో జయ మనోరి అన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో హరితహారంలో భాగంగా ఆమె మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి.. వాటిని కాపాడే బాధ్యత తీసుకోవాలని హరితహారంలో పాల్గొన్న తెరాస నాయకులు ఆనంద్​ కుమార్​ గౌడ్​ పిలుపునిచ్చారు.

Haritha Haram Program In Koti ENT Hospital
కోఠి ఈఎన్​టీ ఆస్పత్రిలో హరితహారం

By

Published : Jul 5, 2020, 7:26 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం హైదరబాద్​ నగరంలో విజయవంతంగా కొనసాగుతోంది. మొక్కలు నాటాలి.. పచ్చదనాన్ని పెంచాలన్న నినాదంతో అధికారులు, నాయకులు మొక్కలు నాటడానికి ముందుకు వస్తున్నారు. గోషామహల్​ నియోజకవర్గంలోని కోఠి ఈఎన్​టీ ఆస్పత్రిలో తెరాస సీనియర్​ నాయకులు ఆనంద్​ కుమార్​ గౌడ్, ఈఎన్​టీ ఆర్​ఎంవో జయ మనోరి ఆస్పత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు.

పచ్చదనం లేక.. పర్యావరణం పాడైపోయి.. మానవాళి మనుగడకే ప్రమాదం పొంచి ఉందని.. అందుకే ప్రతీ ఒక్కరు బాధ్యతాయుతంగా మొక్కలు నాటాలని తెరాస నేత ఆనంద్​ కుమార్​ గౌడ్​ తెలిపారు. పచ్చదనంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలంటే.. అందరూ విధిగా మొక్కలు నాటి.. వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. మొక్కలు, చెట్లు ఎక్కడ ఉంటే.. అక్కడ ఆరోగ్యం ఉంటుందని, ఒక మొక్క నాటామంటే.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వేసిన ఒక అడుగు వేసినట్టే అని ఆర్​ఎంవో జయ మనోరి అన్నారు.

ఇదీ చూడండి:విదేశీ యాప్​లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'

ABOUT THE AUTHOR

...view details