నాలుగు శుక్రవారాలు హరితహారం దినోత్సవంగా నిర్వహించాలని నగర మేయర్ రామ్మోహన్ అధికారులకు ఆదేశించారు. ప్రతి ఉద్యోగి కనీసం 10 మొక్కలు నాటాలని చెప్పారు. హరితహారంలో తాను, కమిషనర్, జోనల్ కమిషనర్లు పాల్గొంటామని తెలిపారు. నగరంలో 24 మంది ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 15లక్షల మొక్కల పంపిణీ జరగాలని ప్రతి శాఖ సమన్వయంతో పాల్గొనాలని హరితహారం కార్యక్రమాన్ని విజయమంతం చేయాలని మేయర్ నగర ప్రజలకు, అధికారులకూ పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరం రాను రానూ కాంక్రీట్ జంగల్గా మారిపోతోందని నగరానికి పూర్వ గార్డెన్ సిటీ వైభవం తీసుకురావాలని అన్నారు.
హరితహారంగా శుక్రవారం: మేయర్ - హరితహారం
రేపటి నుంచి నాలుగు శుక్రవారాలను హరితహారం దినోత్సవంగా నిర్వహించాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతి శాఖలోని ఉద్యోగి పాల్గొని మనిషికి 10 చొప్పున మొక్కలు నాటాలని అందరూ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

హరితహారంగా శుక్రవారం.