మేడ్చల్ జిల్లా హకీంపేట్‌లోని 99 బెటాలియన్ ఆర్ఏఎఫ్ ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా వృక్ష మిత్ర కార్యక్రమం చేపట్టారు. ఆర్‌ఏఎఫ్ క్యాంప్ పరిసరాల్లో బెటాలియన్ కమాండర్ వీజే సుందరం నేతృత్వంలో... హరిత యాక్షన్ ఫోర్స్ సభ్యులు 20 వేల మొక్కలు నాటారు. డ్రోన్ ద్వారా చిత్రీకరించిన మొక్కలు నాటే దృశ్యాలు అందర్ని ఆకట్టుకునేలా ఉన్నాయి.
'రాష్ట్రాన్ని ఆకుపచ్చ వనంగా తీర్చిదిద్దడమే హరితహారం ఉద్దేశం' - harita action forec participate haritaharam at raf campus
రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని ఆకుపచ్చ వనంగా తీర్చిదిద్దడమే హరితహారం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆర్ఏఎఫ్ 99 బెటాలియన్ కమాండర్ సుందరం అన్నారు. ఆరోవిడత హరితహారంలో భాగంగా ఆర్ఏఎఫ్ క్యాంప్ పరిసరాల్లో హరిత యాక్షన్ ఫోర్స్ సభ్యులు మొక్కలు నాటారు.
!['రాష్ట్రాన్ని ఆకుపచ్చ వనంగా తీర్చిదిద్దడమే హరితహారం ఉద్దేశం' haritaharam-program-at-raf-campus-hakimpet-hydearabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7779368-619-7779368-1593168225895.jpg)
రాష్ట్రాన్ని ఆకుపచ్చ వనంగా తీర్చిదిద్దడమే హరితహారం ఉద్దేశం
రాష్ట్రంలో అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే కాక ప్రతి గ్రామ శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపట్టే విధంగా వారిలో అవగాహన కల్పిస్తున్నామని కమాండర్ తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనం పెరిగితే... పర్యావరణంలో ఆక్సిజన్ శాతం పెరిగి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, ఆహ్లాదంగా జీవించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మొక్కలు నాటి వదిలేయకుండా వాటి పెరుగుదలకు కావాల్సిన సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇదీ చూడండి:'కరోనా అంటే ఏంటి? మాకు నిజంగా తెలియదే..!'