తెలంగాణ

telangana

ETV Bharat / state

బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఒక్క హామీనైనా నెరవేర్చిందా: హరీశ్‌రావు - మంత్రి హరీశ్​రావు న్యూస్

HarishRao Responded to JP Nadda Comments: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు స్పందించారు. నిన్న బీజేపీ సభలో డైలాగుల కోసం, ప్రాస కోసం నడ్డా పాకులాడిన్నట్లుందని విమర్శించారు. బీఆర్ఎస్​కు.. వీఆర్ఎస్ అని చెప్పి బీఆర్ఎస్​కు ఓటమి లేదని, జేపీ నడ్డానే పరోక్షంగా అంగీకరించారని, మంత్రి హరీశ్​రావు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాదు, ఇవ్వని వాటినీ అమలుచేసిన ఘనత.. టీఆర్ఎస్ సర్కార్​కే దక్కుతుందని స్పష్టం చేశారు. బీజేపీ ఎన్నికల హామీల అమలుపై.. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

HarishRao Responded to JP Nadda Comments
HarishRao Responded to JP Nadda Comments

By

Published : Dec 16, 2022, 8:21 PM IST

బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఒక్క హామీనైనా నెరవేర్చిందా: హరీశ్‌రావు

HarishRao Responded to JP Nadda Comments: ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్‌ బహిరంగ సభలో టీఆర్ఎస్ సర్కార్‌పై జేపీ నడ్డా ఆరోపణలను మంత్రి హరీశ్‌రావు తిప్పికొట్టారు. నడ్డా ఓ జాతీయ పార్టీకి అధ్యక్షుడనే విషయాన్ని మరిచి కేసీఆర్‌పై విమర్శలు చేశారని మండిపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఒక్కటైనా ఎన్నికల హామీని నెరవేర్చిందా? అని నిలదీశారు. తెలంగాణకు దిల్లీలో అవార్డులు గల్లీలో రాజకీయ విమర్శలు అన్నట్లుగా.. కేంద్రం వైఖరి ఉందని విమర్శించారు.

ప్రజల కోసం తల్లడిల్లే వారు కేసీఆర్‌ అయితే.. ప్రభుత్వాలను ఎలా పడగొట్టాలి? వ్యక్తులపై ఎలా దాడులు చేయాలనే వైఖరి బీజేపీది అని హరీశ్‌రావు ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాదు.. ఇవ్వని వాటిని అమలుచేసిన ఘతన టీఆర్ఎస్ సర్కార్‌ది అని స్పష్టం చేశారు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బీజేపీ హామీ ఇచ్చిన ఫ్లోరోసిస్‌ పరిశోధనా కేంద్రం ఏర్పాటు ఏమైందని హరీశ్‌రావు.. నడ్డాను ప్రశ్నించారు.

బీఆర్ఎస్​కు వీఆర్ఎస్ అంటారు. వీఆర్ఎస్ అంటే ఏంటి. స్వచ్ఛంద పదవి విరమణ అంటే బీఆర్ఎస్ తానకు తాను స్వచ్ఛందంగా పదవి విరమణ తిసుకుంటే తప్ప, బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని, బీఆర్ఎస్​కు ఓటమి లేదని స్వయంగా నడ్డాఒప్పుకన్నట్టు. ఎవరో ఎదో రాసి ఇస్తే ప్రాస కోసం మాట్లాడినట్లు ఉంది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటికి 17 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఎక్కడ ఉన్నయో 17 కోట్ల ఉద్యోగాలు. -మంత్రి హరీశ్​రావు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details