తెలంగాణ

telangana

ETV Bharat / state

Harish Rao Latest News : 'వేరే రాష్ట్రాల్లో స్కాములు ఉంటే.. తెలంగాణలో స్కీములు ఉన్నాయి' - తెలంగాణ వైద్యారోగ్య శాఖపై హరీశ్‌రావు

HarishRao about Telangana Health system : మనిషి పుట్టుక నుంచి చావుదాకా అన్ని రకాల సేవలను వైద్యారోగ్యశాఖ అందిస్తోందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కరోనాను మించిన వైరస్‌ వచ్చినా తట్టుకునేలా.. ప్రతిష్టమైన వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆరోగ్యరంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని హరీశ్‌రావు పేర్కొన్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 1, 2023, 1:47 PM IST

జననం నుంచి మరణం వరకు వైద్యారోగ్యశాఖ సేవలు అందిస్తుంది

HarishRao on Telangana Health Department : రాష్ట్రంలో కొత్తగా 466 వైద్య వాహనాలను ప్రారంభించడం సంతోషంగా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి ప్రతి లక్ష జనాభాకు ఒక అంబులెన్స్‌ ఉండేదని.. ప్రస్తుతం 75,000 మందికి ఒక అంబులెన్స్‌ ఉందని వివరించారు. అమ్మ ఒడి వాహనాలు కావాలని కోరగానే ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు ఇచ్చారని తెలిపారు. జననం నుంచి మరణం వరకు వైద్యారోగ్య శాఖ సేవలు అందిస్తున్నట్లు హరీశ్‌రావు వెల్లడించారు. అత్యవసర సేవల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన 466 అంబులెన్సులను.. హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో 108 అంబులెన్సులు 204 ఉండగా.. అమ్మఒడి వాహనాలు 228 , పార్థివదేహాలను తరలించే 34 వాహనాలున్నాయి. సీఎస్ శాంతికుమారి, మంత్రి హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ అధికారులతో కలిసి ఈ వాహనాలను ప్రారంభించటంతో.. ఈ సేవలు అందబాటులోకి వచ్చాయి.

HarishRao Speech 108 and Ammavadi Vehicles Begin : వైద్యారోగ్య శాఖలో ఐదంచెల వ్యవస్థను కేసీఆర్‌ ఏర్పాటు చేశారని హరీశ్‌రావుతెలిపారు. దీనిని నీతిఆయోగ్‌ సైతం అభినందించినట్లు పేర్కొన్నారు. కరోనా కంటే పెద్ద జబ్బులు వచ్చినా రాష్ట్రం తట్టుకుంటుందని ఆయన చెప్పారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని వివరించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయలేదని.. కుటుంబ పెద్దగా కేసీఆర్‌ సంక్షేమ పథకాలు ఇస్తున్నారని హరీశ్‌రావు వెల్లడించారు.

HarishRao about Telangana Health system :ఈ క్రమంలోనే ఆశావర్కర్ల సెల్‌ఫోన్‌ బిల్లులను.. రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని హరీశ్‌రావు తెలిపారు. ఆశావర్కర్లకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించిందని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో స్కామ్‌లు ఉంటే.. తెలంగాణలో స్కీమ్‌లు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రం రాక ముందు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగేవని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 70 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అత్యవసర వేళ ప్రాణాలు కాపాడేందుకు.. అంబులెన్స్‌లను డైనమిక్ పొజిషన్‌ చేయాలనుకుంటున్నామని అన్నారు. 108 ఉద్యోగులకు 4 స్లాబులుగా వేతనాల పెంపు అని హరీశ్‌రావు వివరించారు.

"కొత్తగా 466 వాహనాలను ప్రారంభించడం సంతోషంగా ఉంది. రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రతి లక్ష జనాభాకు ఒక అంబులెన్స్‌ ఉండేది. ప్రస్తుతం 75 వేల మందికి ఒక అంబులెన్స్‌ ఉంది. అమ్మఒడి వాహనాలు కావాలని కోరగానే సీఎం నిధులు ఇచ్చారు. జననం నుంచి మరణం వరకు వైద్యారోగ్యశాఖ సేవలు అందిస్తుంది. కరోనా కంటే పెద్ద జబ్బులు వచ్చినా రాష్ట్రం తట్టుకుంటుంది. ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఎన్నికల్లో ఓట్ల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. కుటుంబ పెద్దగా కేసీఆర్‌ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. అత్యవసర వేళ ప్రాణాలు కాపాడేందుకు అంబులెన్స్‌లను డైనమిక్ పొజిషన్ చేయాలనుకుంటున్నాం." - హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

ఇవీ చదవండి :Telangana Diagnostics : తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌.. అందుబాటులోకి 134 వైద్య పరీక్షలు

Harish rao Warangal Tour : 'ఒకవైపు విద్య, వైద్యం.. మరోవైపు ఉపాధి'

ABOUT THE AUTHOR

...view details