Ministers Fires on Rahul Gandhi : ఖమ్మం వేదికగాతెలంగాణ జనగర్జన సభ వేదికగా రాహుల్ గాంధీ.. బీఆర్ఎస్ సర్కారుపై చేసిన విమర్శలను మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ధీటుగా సమాధానం ఇచ్చారు. మాది బీజేపీ బంధువుల పార్టీ కాదని.. మీదే భారత రాబందుల పార్టీ . ఏఐసీసీ అంటేనే.. అఖిల భారత కరప్షన్ కమిటీ. దేశంలో అవినీతికి, అసమర్థతకు ఒకే ఒక్క కేరాఫ్ అడ్రస్.. కాంగ్రెస్ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. స్కాములే తాచుపాములై.. యూపీఏను.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను దిగమింగిన చరిత్రను ఇంకా ప్రజలు మరిచిపోలేదన్నారు.
KTR Tweet on Rahul Gandhi : తమ పార్టీ బీజేపీకి.. బీ టీమ్ కాదని, కాంగ్రెస్ పార్టీకి.. సీ టీమ్ అంతకన్నా కాదని కేటీఆర్ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ-కాంగ్రెస్ రెండింటీనీ ఒంటిచేత్తో ఢీకొట్టే ఢీ టీమ్.. బీఆర్ఎస్ అని తెలిపారు. భారత్ రాష్ట్ర సమితిని నేరుగా ఢీకొనే దమ్ములేక.. బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చే కుట్ర చేస్తారా అని ప్రశ్నించారు. ఈ మిస్ ఫైరింగ్‌లో కుప్పకూలేది.. కాంగ్రెస్ అని వివరించారు. లక్ష కోట్లు వ్యయం కాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతా అని ఆయన ప్రశ్నించారు. అర్థంలేని ఆరోపణలు చేసి ప్రజాక్షేత్రంలో ఎన్నిసార్లు నవ్వులపాలవుతారన్నారు. కాంగ్రెస్, బీజేపీలను విమర్శిస్తూ.. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.