Harish Rao Speech at Telangana Bhavan : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫిబ్రవరిలో ప్రతిరోజు తెలంగాణ భవన్(Telangana Bhavan)కు వచ్చి కార్యకర్తలను కలుస్తారని, త్వరలోనే ఆయన జిల్లాల పర్యటనలు కూడా ఉంటాయని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో నేతలను ఉద్దేశించి హరీశ్ రావు(Harishrao) ప్రసంగించారు. కేసీఆర్ కోలుకుంటున్నారని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని చెప్పారు.
గర్భిణీలకు ఇచ్చే కేసీఆర్ కిట్(KCR Kit Scheme) మీద కేసీఆర్ గుర్తును కాంగ్రెస్ ప్రభుత్వం చెరిపేస్తోందని, కిట్ నుంచి తొలగించవచ్చేమోగానీ తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దులు, వాయిదాలు అన్నట్లుగా నడుస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ విపరీత చర్యలపై ఉద్యమిస్తామని మాజీ మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేలంతా బస్సు కట్టుకుని బాధితుల దగ్గరకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. తమ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హరీశ్‌రావు చెప్పారు.
హరీశ్‌రావు వర్సెస్ రాజగోపాల్‌రెడ్డి - అధికార పదవులపై సభలో రభస