మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం నిర్వహించారు. అధికంగా తీసుకున్న వడ్డీని ఎస్‌హెచ్‌జీలకు తిరిగి చెల్లించాలని హరీశ్‌రావు ఆదేశించారు. వడ్డీతో సహా నెల రోజుల్లో ఎస్‌హెచ్‌జీలకు జమ చేయాలని తెలిపారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారమే బ్యాంకుల వడ్డీలు ఉండాలని తెలిపారు. రుణాలపై అదనంగా లెవీయింగ్ ఛార్జీలు వేయొద్దని పేర్కొన్నారు. విద్య, గృహ, సాగు, అనుబంధ రంగాలకు ఎక్కువ రుణాలు ఇవ్వాలని వివరించారు. ఆయిల్ పామ్ విస్తరణకు బ్యాంకులు తోడ్పాటు అందించాలని హరీశ్‌రావు కోరారు.
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారమే బ్యాంకుల వడ్డీలు ఉండాలి: హరీశ్‌రావు - Harish Rao latest news
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారమే బ్యాంకుల వడ్డీలు ఉండాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. రుణాలపై అదనంగా లెవీయింగ్ ఛార్జీలు వేయొద్దని తెలిపారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Harish Rao