పసిపిల్లలను ఒత్తిడికి గురిచేసే చర్యలకు పాల్పడవద్దని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను మాజీ మంత్రి హరీశ్ రావు కోరారు. పిల్లల ఆత్మహత్యలపై ట్విటర్ వేదికగా ఆవేదన వెలిబుచ్చారు. మన కనుపాపలైన బిడ్డల్ని కాపాడుకుందామన్నారు. కొన్ని రోజులుగా పరీక్షల్లో ఫెయిలైన పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తే గుండె తరుక్కుపోతోందన్నారు. పరీక్షల్లో తప్పితే జీవితంలో ఓడినట్లు కాదని... ప్రాణాలు పోతే తిరిగిరావని వివరించారు. దయచేసి విద్యార్థులు ఎవరు ప్రాణాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
పరీక్షలు మళ్లీ వస్తాయి... ప్రాణాలు రావు: హరీశ్ రావు - students suicides
" కొన్ని రోజులుగా పరీక్షల్లో తప్పిన పిల్లలు ఆత్మ హత్యలు చేసుకోవడం చూస్తే గుండె తరుక్కుపోతోంది" - హరీశ్ రావు

ఇంటర్ ఫలితాలపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్ రావు