Harish Rao reacted to the increase in medicine prices: ఔషధ ధరలు 12 శాతం పెంచాలన్న కేంద్రం నిర్ణయాన్ని మంత్రి హరీశ్ రావు తప్పబట్టారు. ప్రజల ప్రాణాలు పోసే ఔషధాల ధరలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం దారుణమన్నారు. జ్వరం, ఇన్ఫెక్షన్స్, బీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా తదితర చికిత్సల్లో వినియోగించే మందులతో పాటు పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి 800 పైగా మందుల ధరలు పెంచాలన్న కేంద్రం నిర్ణయం పేదలు, మధ్యతరగతి వారికి భారం అవుతుందని మంత్రి పేర్కొన్నారు.
సామాన్యుడిని ఇబ్బంది పెట్టడమే బీజేపీ ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం, చివరకు జబ్బు చేస్తే ప్రాణాలు కాపాడే మందుల ధరలు కూడా పెంచేందుకు సిద్దమైందని మండిపడ్డారు. బీజేపీ చెబుతున్న అమృత్ కాల్ ఇదేనా అని ప్రశ్నించిన మంత్రి... ఇది అచ్చే దిన్ కాదు.. సామాన్యుడు సచ్చే దిన్ అంటూ విమర్శించారు. దేశంలో బీజేపీ పాలన ముగిసే రోజు దగ్గరపడిందంటూ ట్వీట్ చేశారు.
మహిళ జర్నలిస్టులకు వైద్య శిబిరాలు...
మహిళల సంపూర్ణ ఆరోగ్యం లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ‘ఆరోగ్య మహిళ’ ప్రత్యేక కార్యక్రమాన్ని మహిళలందరూ వినియోగించుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేక క్లినిక్‌లకు ఆదరణ పెరుగుతోందన్నారు. మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని హైదరాబాద్‌లో సమాచార, పౌరసంబంధాల శాఖ కార్యాలయం వద్ద ఏర్పాటు చేశామన్నారు.
మహిళలు ప్రధానంగా తమ నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న ఎనిమిది రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించి పరీక్షలు చేసి వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించిన తర్వాత మూడు మంగళవారాల్లో 19 వేల మందికిపైగా వైద్య శిబిరాల్లో మహిళలు పరీక్షలు చేయించుకున్నారు. ఈ నెల 28న అత్యధికంగా 7965 మందికి వైద్య పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 100 స్పెషల్ క్లినిక్‌లలో మొదటి వారం 4,793 మంది, రెండో మంగళవారం 6,328 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మూడు మంగళవారాల్లో 10 వేలకుపైగా నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు.
ఇవీ చదవండి: