తెలంగాణ

telangana

ETV Bharat / state

బూతులు మాట్లాడే ప్రతిపక్షాలకు పోలింగ్‌ బూత్‌లో ప్రజలు బుద్ధి చెబుతారు : హరీశ్​ రావు - Harish Rao Reaction on Congress Leaders Commentas

Harish Rao on Telangana Development : తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉందని మంత్రి హరీశ్​ రావు తెలిపారు. పక్క రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారంగా మారిందని చెప్పారు. తెలంగాణ బిడ్డను ఓడించడానికి రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ ఒకటయ్యాయని ఆరోపించారు. బూతులు మాట్లాడే ప్రతిపక్ష నేతలకు పోలింగ్‌ బూత్‌లలో ఓట్లతో ప్రజలు బుద్ధి చెబుతారని హరీశ్ రావు అన్నారు.

Harish Rao on Telangana Development
Harish Rao Meet the press Programme in Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2023, 12:16 PM IST

Updated : Nov 15, 2023, 1:56 PM IST

Harish Rao Comments బూతులు మాట్లాడే ప్రతిపక్షాలకు పోలింగ్‌ బూత్‌లో ప్రజలు బుద్ధి చెబుతారు

Harish Rao on Telangana Development: తెలంగాణ బిడ్డను ఓడించడానికి రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ ఒకటయ్యాయని మంత్రి హరీశ్​రావు అన్నారు. హైదరాబాద్​లో మీట్​ ది ప్రెస్ ప్రోగ్రామ్​లో హరీశ్​ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పక్క రాష్ట్రాలకు అన్నంపెట్టే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగేవని .. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 76 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

కార్మికులను గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది : హరీశ్​రావు

Harish Rao on Hyderabad Development : మన ఊరు-మన బడి పథకం ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని హరీశ్​రావు తెలిపారు. విద్యారంగంపై బీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి(BRS Focused on Education) పెట్టిందని వెల్లడించారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను బీఆర్​ఎస్​ భర్తీ చేసిందని అన్నారు. ప్రైవేటు రంగంలో రాష్ట్ర యువతకు 24 లక్షల ఉద్యోగాలు వచ్చాయని స్పష్టం చేశారు. రాజస్థాన్‌లో పదేళ్లలో పదిసార్లు ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయని ఆరోపించారు. ఐటీ రంగంలో హైదరాబాద్‌ అద్భుతమైన వృద్ధిని సాధించిందని పేర్కొన్నారు.

Harish Rao Clarity on Telangana Debts : అప్పుల విషయంలో తెలంగాణ నియంత్రణలో ఉందని.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు అందుతున్నాయని హరీశ్​రావు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన కర్ణాటక మోడల్‌ ఫెయిల్‌ అయిందని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా రూ.2 వేలు పింఛను ఇస్తున్నారా అని ప్రశ్నించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఉంటుందని జోస్యం చెప్పారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజీ ఒక్కటే కాదని.. మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరమే కుంగినట్లు విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

'రేవంత్‌రెడ్డికి రైతులంటే గౌరవం లేదు, వ్యవసాయంపై అవగాహన లేదు'

"కేసీఆర్‌ చేతుల్లో రాష్ట్రం ఉండటం వల్లే సుభిక్షంగా ఉంది. అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. సీఎం కేసీఆర్‌ రాజీలేని పాలన సాగిస్తున్నారు. కేంద్ర ఇచ్చే అవార్డుల్లో రాష్ట్రం అవార్డుల పంట పండిస్తోంది. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దరిదాపుల్లో ఏ రాష్ట్రం లేదు. మ్యానిఫెస్టోలో(BRS Manifesto 2023) పెట్టిన 90 శాతం హమీలు అమలు చేశాం. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా రైతుబంధు, రైతుబీమా అమలు చేశాం. పట్టణాల్లో ఉండే సౌకర్యాలు అన్నీ గ్రామాల్లో అభివృద్ధి చేశాం. కేసీఆర్‌ విజన్‌ కారణంగానే విద్యుత్‌ కొరతను అధిగమించాం. కోతలు లేకుండా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం. కర్ణాటకలో 5 గంటల కరెంట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. కర్ణాటకలో ప్రస్తుతం రైతులకు 2 గంటల కరెంట్‌ కూడా ఇవ్వలేదు." - హరీశ్ రావు, రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి

Harish Rao Latest Comments : కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో కరవు, కర్ఫ్యూ లేవని హరీశ్​రావు అన్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా అభివృద్ధి చేశామని తెలిపారు. భాగ్యనగరానికి గ్రీన్​ సిటీ అంతర్జాతీయ అవార్డు(Green City Award to Hyderabad) వచ్చిందని తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఇంతవరకూ వరుసగా ఎవరూ మూడోసారి సీఎం కాలేదని.. కేసీఆర్ అయి రికార్డు సృష్టిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు అజెండా లేదని.. బీఆర్​ఎస్​ను అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని.. అలాంటి ప్రతిపక్షాలకు పోలింగ్‌ బూత్‌లలో ఓట్లతో ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.

"తెలంగాణ ఉద్యమంలో నాపై 200 కేసులు పెట్టారు. ఉద్యమ సమయంలో పదవులకు రాజీనామా చేశాం. ఓటమి భయంతో కాంగ్రెస్‌ నేతలు అల్లర్లు చేస్తున్నారు. అల్లర్లు చేసి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్‌ నేతలు చూస్తున్నారు. గతంలో మహాకూటమి పేరుతో విపక్షాలు ప్రత్యక్షంగా బీఆర్​ఎస్​తో తలపడ్డాయి. ప్రస్తుతం పరోక్షంగా అందరూ ఒకటయ్యారు." - హరీశ్​రావు, రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి

వంద అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది : హరీశ్​రావు

Minister Harish Rao Speech at Medak Public Meeting : 'ఆ రాష్ట్రానికి ఒక నీతి.. మా రాష్ట్రానికి ఒక నీతా..' కేంద్రంపై హరీశ్​రావు ఫైర్

Last Updated : Nov 15, 2023, 1:56 PM IST

ABOUT THE AUTHOR

...view details