Harish Rao On MP Kotha Prabhakar Reddy Health ఎంపీపై దాడి జరిగితే కోడి కత్తి అంటూ అపహాస్యం చేస్తారా Harish Rao On MP Kotha Prabhakar Reddy Health : కత్తి దాడితో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ ఎంపీ, దుబ్బాక నియోజకవర్గం బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని మంత్రి హరీశ్‌రావు నేడు మరోసారి పరామర్శించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం కాస్త నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
KTR Tweet on MP Kotha Prabhakar Reddy Attack : 'ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి.. కాంగ్రెస్ గూండా పనే.. ఇంకా ఆధారాలు కావాలా రాహుల్?'
ఓ ప్రజాప్రతినిధిపై కత్తితో దాడి చేస్తే కోడి కత్తి అంటూ ప్రతిపక్ష నేతలు అపహాస్యం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీకి అలాంటి డ్రామాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కడుపులో చిన్న పేగుకు 4 చోట్ల రంధ్రాలు పడితే, ఇంత చిల్లర మాటలు మాట్లాడతారా అంటూ ధ్వజమెత్తారు. ఘటనను ఖండించాల్సిన ప్రతిపక్షాలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాయని.. సీనియర్ నాయకులూ చిల్లర కామెంట్స్ చేస్తున్నారని తీవ్రంగా ఫైర్ అయ్యారు.
Governor Reacted on MP Kotha Prabhakar Reddy Murder Attempt : 'ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి'
ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారని మంత్రి తెలిపారు. నిందితుడి కాల్ డేటా సేకరించారని.. వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు. ఒకట్రెండు రోజుల్లో కుట్ర కోణాన్ని ఛేదిస్తారని ఆశిస్తున్నానని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఇలాంటి నీచ రాజకీయాలు ఎన్నడూ చూడలేదన్న మంత్రి.. ఇన్నేళ్ల చరిత్రలో ఎన్నికల సమయంలో ఇలా దాడులు జరగడం చూడలేదని పేర్కొన్నారు. పని తనం తప్ప పగతనం లేని నాయకుడు కేసీఆర్ అని.. అలా పగ ఉంటే ఇప్పటికే ఎంతో మంది జైళ్లలో ఉండేవారని చెప్పారు. ఏదేమైనా ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని.. తెలంగాణ సమాజం ఎప్పటికీ ఇలాంటివి హర్షించదని స్పష్టం చేశారు.
CM KCR on Kotha Prabhakar Reddy Murder Attempt : 'ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడి నాపై జరిగినట్లే.. మాకు తిక్కరేగితే రాష్ట్రంలో దుమ్మురేగిపోద్ది'
ఓ ఎంపీపై కత్తి దాడి జరిగితే.. ప్రతిపక్ష పార్టీల నేతలు కోడి కత్తి అంటూ రాజకీయాలు అపహాస్యం చేస్తున్నారు. సీనియర్ నాయకులు కూడా చిల్లర కామెంట్స్ చేస్తున్నారు. కడుపులో చిన్న పేగుకు 4 చోట్ల రంధ్రాలు పడితే ఇంత చిల్లర మాటలు మాట్లాడుతారా..? ఖండించాల్సిన ప్రతిపక్షాలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాయి. పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడి కాల్ డేటా సేకరించారు. వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ఒకట్రెండు రోజుల్లో కుట్ర కోణం ఛేదిస్తారని ఆశిస్తున్నా. - మంత్రి హరీశ్‌రావు
MP Kotha Prabhakar Reddy Health Bulletin :మరోవైపు.. యశోద వైద్యులు ప్రభాకర్‌రెడ్డి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పలేమని అన్నారు. ఎంపీకి ఇన్‌ఫెక్షన్ లక్షణాలు ఉన్నాయని.. 5 రోజుల పాటు ఐసీయూలో చికిత్స అందిస్తామని తెలిపారు.
Murder Attempt on MP Kotha Prabhakar Reddy : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం.. యశోద ఆస్పత్రిలో శస్త్రచికిత్స, ఐసీయూకు తరలింపు