Harish Rao on Government Hospitals: దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రులను తీర్చిదిద్దుతున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి ఆసుపత్రిలో డయాలసిస్, బ్లడ్ బ్యాంకులను ఆయన ప్రారంభించారు. వరంగల్ హెల్త్‌సిటీతో పాటు హైదరాబాద్ నలువైపులా నాలుగు ఆసుపత్రులను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. గత కాంగ్రెస్, టీడీపీ హయంలో ఇలాంటి ఒక్క ఆసుపత్రిని నిర్మించలేదని అన్నారు. మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఒకప్పుడు కేవలం హైదరాబాద్‌లోనే మూడు డయాలసిస్ సెంటర్లు మాత్రమే ఉండేవని హరీశ్‌రావు గుర్తు చేశారు. కానీ నేడు 102 సెంటర్లు ఉన్నాయని వివరించారు. సింగల్ యూజ్ డయాలసిస్ ఫిల్టర్‌ను తెలంగాణకు పరిచయం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న డయాలసిస్ సేవలు యావత్ దేశానికే ఆదర్శమని తెలిపారు. నిమ్స్‌లో మరో 2,000 పడకలు రానున్నాయని.. హైదరాబాద్‌లో కొత్తగా 6,000 పడకలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ట్రామా కేర్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ తెస్తున్నామని హరీశ్‌రావు అన్నారు.
"ఒకప్పుడు కేవలం హైదరాబాద్‌లోనే మూడు డయాలసిస్ సెంటర్లు మాత్రమే ఉండేవి. కానీ నేడు 102 డయాలసిస్ సెంటర్‌లు ఉన్నాయి. సింగల్ యూజ్ డయాలిసిస్ ఫిల్టర్‌ను తెలంగాణకు పరిచయం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. నిమ్స్‌లో మరో 2,000 పడకలు రానున్నాయి. హైదరాబాద్‌లో కొత్తగా 6,000 పడకలు రానున్నాయి. ట్రామా కేర్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నాం. త్వరలోనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ తెస్తున్నాం." - హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
వరంగల్ ఆసుపత్రి నిర్మాణంపై నిన్న అధికారులతో హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. వచ్చే దసరా నాటికి వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్, ఎల్బీనగర్, అల్వాల్ ఆసుపత్రుల నిర్మాణాలను సైతం వేగవంతం వేగవంతం చేయాలని పేర్కొన్నారు వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రులు, వైద్యకళాశాలల పనుల పురోగతి, ఇతర అంశాలపై చర్చించారు.