Harish Rao on Congress Six Guarantees: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు వాటిపై తక్షణమే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. మార్చి 17తో వంద రోజులు పూర్తవుతాయని, ఫిబ్రవరి నెలాఖరులోపే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్(Parliament Elections 2024) వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో కోడ్ వస్తే గ్యారంటీల అమల్లో మరింత జాప్యం జరిగే అవకాశముందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Harish Rao Instructions to Telangana Government: ఎన్నికల కోడ్ పేరిట గ్యారంటీల దాటవేత జరుగుతుందా అనే అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోందనిహరీశ్రావుఅన్నారు. గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుని జీఓలు విడుదల చేస్తే కోడ్ వచ్చినా ఇబ్బంది ఉండదని సలహా ఇచ్చారు. శ్వేత పత్రాలు కూడా హామీల ఎగవేతల పత్రాలా అనే అనుమానం కలుగుతోందని అన్నారు.
ఫిబ్రవరి 20వ తేదీ లోపే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఆరోగ్య శ్రీ పది లక్షలకు ప్రభుత్వం పెంచిందని, ఎంత మందికి వర్తించిందో వివరాలు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. జాబ్ కేలండర్(Harish Rao on Job Calendar)పై మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వానికి హరీశ్ రావు సూచించారు.
మెట్రోలో మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రయాణం - ప్రయాణికులతో సరదాగా ముచ్చట