Harish Rao Inaugurates Arete Hospital in Hyderabad : తెలంగాణ అంతర్జాతీయ మెడికల్ హబ్‌గా మారుతుందని.. దేశంలో ఎక్కడా లేని ఆరోగ్య సేవలు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి బయోడైవర్సిటి పార్కు సమీపంలో అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన అరీట్ హస్పిటల్(Arete Hospital)ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ హాస్పిటల్ 250 పడకల సదుపాయాలతో అత్యాధునిక అంతర్జాతీయ వైద్యం, న్యూరోసైన్సెస్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, రెనల్ సైన్సెస్, ప్రివెంటివ్ హెల్త్, కార్డియాక్ సైన్సెస్, ఆంకాలజీ, క్రిటికల్ కేర్, గ్యాస్ట్రోసైన్సెస్, పల్మోనాలజీ, రెస్పిరేటరీ డిసీజెస్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులో ఉండనున్నాయని తెలిపారు.
Harish Rao on Hyderabad Medical Development: రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో ఆస్పత్రులు అందుబాటులోకి వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో అన్ని రకాల వైద్య సేవలు ఉన్నాయన్నారు. వైద్య సేవలు పొందేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మెడికల్ టూరిజం పెరగడం వల్ల ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు.
Hyderabad Become a Global Medical Hub : వైద్య నిపుణులు, అన్నిరకాల సిబ్బంది, సౌకర్యాలు ఉండడం వల్ల హైదరాబాద్ మెడికల్ హబ్‌గా పెరిగేందుకు ఒక కారణమని అన్నారు. హైదరాబాద్‌లో వైద్యరంగమే కాకుండా ప్రతి రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు ప్రజలకు ఆర్థిక భారం కాకుండా తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలని అరిట్ ఆస్పత్రి యాజమాన్యానికి సలహా ఇచ్చారు. . ఆసుపత్రి సేవలను పొందడంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించి.. మెరుగైన సేవలను అందించటమే లక్ష్యంగా అరీట్ హాస్పిటల్స్‌ని నిర్మించామని హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ తీగల విజయేందర్ రెడ్డి తెలిపారు.