రాష్ట్రంలోని మరో 10 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నేషనల్ క్వాలిటీ అష్యురెన్స్ స్టాండర్స్ ( NQAS) సర్టిఫికేట్ రావడం అభినందనీయమని వైద్యారాగ్యశాఖ మంత్రి హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు. వీటితో కలిపి ఇప్పటికి 125 ఆసుపత్రులకు ఈ గుర్తింపు వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఎన్‌క్వాస్ గుర్తింపు కలిగిన ఆసుపత్రుల్లో తెలంగాణకు మూడో స్థానం లభించిందని హరీష్‌రావు తెలిపారు.
Harishrao On NQAS: 'ఎన్‌క్వాస్ గుర్తింపు కలిగిన ఆసుపత్రుల్లో తెలంగాణకు మూడో స్థానం' - మంత్రి హరీష్‌రావు
నేషనల్ క్వాలిటీ అష్యురెన్స్ స్టాండర్స్ గుర్తింపు కలిగిన ఆసుపత్రుల్లో తెలంగాణకు మూడో స్థానం లభించిందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. కృషి చేసిన వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపిన హరీష్‌రావు...అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఎన్‌క్వాస్ గుర్తింపు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుందని చెప్పడానికి కేంద్రం ఇచ్చినీ గుర్తింపే నిదర్శనమని మంత్రి తెలిపారు.
Harishrao On NQAS
ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందికి హరీష్‌రావు అభినందనలు తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఎన్‌క్వాస్ గుర్తింపు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పీహెచ్‌సీ స్థాయి నుంచి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుందని చెప్పడానికి కేంద్రం ఇచ్చినీ గుర్తింపే నిదర్శనమని మంత్రి తెలిపారు.